మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను నార్కో పరీక్షలకు అనుమతి కోసం జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి స్పందిస్తూ, నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను అడిగారు. నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్…