Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Urges BCCI to Drop Average Fielders in Team India: జింబాబ్వేపై సిరీస్ గెలిచినా.. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు సిరీస్‌ల్లో భారత జట్టు ఫీల్డింగ్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ, జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు. జట్టులో సగటు స్థాయి ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు ఇకపై చోటు కల్పించొద్దని, అలాంటి ఆటగాళ్లను ధైర్యంగా జట్టు నుంచి తప్పించాలని సన్నీ చెప్పుకొచ్చారు.
‘స్పోర్ట్‌స్టార్’లో తన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ఒక కెప్టెన్ ముగ్గురు లేదా నలుగురు బలహీన ఫీల్డర్ల కోసం ప్రత్యేక ఫీల్డింగ్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. ‘ఒక ఆటగాడు సగటు స్థాయి ఫీల్డర్ అయితే అతనికి జట్టులో స్థానం ఉండకూడదు. అలాంటి ఆటగాళ్లకు డోర్ ద్వారం చూపించి.. వెళ్లిపోండని చెప్పాలి. బంతి వారి వైపు వెళ్లకూడదని కెప్టెన్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ అమర్చాల్సిన పరిస్థితి రావడం సరైంది కాదు. సగటు స్థాయి ఫీల్డర్లకు భారత జట్టులో చోటు ఇవ్వొద్దు’ అని గవాస్కర్ స్పష్టం చేశారు.
Also Read
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
- Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
‘ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో వరుస సిరీస్ పరాజయాల అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జట్టు తన లోపాలను నిజాయితీగా విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. బ్యాటర్లు తమ ఇమేజ్ను నిలబెట్టుకునేందుకు కాకుండా, పరిస్థితికి అనుగుణంగా ప్రతి బంతిని అంచనా వేసి ఆడాలి. టీ20 ఫార్మాట్లో తరచూ భారీ షాట్లు ఆడాల్సి వచ్చినా, వన్డేల్లో మాత్రం కాస్త సమయం తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని గవాస్కర్ చెప్పారు.
ఐపీఎల్‌లోని చిన్న బౌండరీలు కూడా భారత బ్యాటర్లకు ఇబ్బంది కలిగిస్తున్నాయని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ‘భారతదేశంలోని ఫ్లాట్ పిచ్‌లతో పాటు చిన్న బౌండరీల కారణంగా మిస్హిట్లు కూడా సిక్సర్లుగా మారుతున్నాయి. కానీ ఇంగ్లండ్ వంటి దేశాల్లో పెద్ద బౌండరీల కారణంగా అదే షాట్లు క్యాచ్‌లుగా వెళుతున్నాయి. విదేశీ పరిస్థితుల్లో విజయవంతం కావాలంటే బ్యాటర్లు తమ ఆటతీరును పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’ అని సన్నీ సూచించారు. టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు, బ్యాటింగ్‌లో ఓర్పు, సరైన షాట్ ఎంపిక, విదేశీ పరిస్థితులకు అనుగుణంగా ఆడే నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!