Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను రక్షించామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన “ఆపరేషన్ ట్రేస్” ద్వారా 900 మంది పిల్లలను రక్షించామని వెల్లడించారు.. విశాఖపట్నంలో మానవ అక్రమ రవాణా మరియు బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం-1976పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత, రాష్ట్రంలో చట్టాలు మరియు న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ పరస్పర సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని చెప్పారు.
పోక్సో కేసుల్లో కఠిన చర్యలు
POCSO Act కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు వంగలపూడి అనిత… కొన్నిచోట్ల నిందితులకు బెయిల్ రాకముందే శిక్షలు పడుతున్నాయని చెప్పారు. ఆపరేషన్ ట్రేస్‌తో పాటు, వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన 180 మందిని కూడా సురక్షితంగా రక్షించామని మంత్రి వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సమర్థ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధం, బలవంతపు కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు మరింత వేగవంతం చేస్తామని చెప్పారు.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!