Minister Narayana: ఆక్రమణదారులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్.. స్వచ్ఛందంగా స్వాధీనం చేయండి.. లేదా..?
- ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్..
- మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా స్వాధీనం చేయాలి..
- లేదంటే ప్రభుత్వం ఆ పని చేస్తుందని స్పష్టం చేసిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా స్వాధీనం చెయ్యాలన్నారు.. లేదంటే ప్రభుత్వం ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇక, వచ్చే నెలాఖరులోగా టీడీఆర్ బ్లాండ్లపై స్పష్టత వస్తుందని బాధ్యులపై చర్యలు తప్పవన్నారు నారాయణ. మరోవైపు, రుషికొండ భవనాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని, వాటి వినియోగంపై అందరి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. కాపాలుప్పాడ డంపింగ్ యార్డ్ నిర్వహణ , సాలీడ్ వెస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ పనితీరు పరిశీ లించిన మునిసిపల్ శాఖమంత్రి నారాయణ.. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క మంత్రి ఈ ప్లాంట్ను పరిశీలించలేదు. రెండు నెలలు నుంచి మునిసిపల్ శాఖ ను చూస్తే అస్తవ్యస్తంగా చేశారన్నారు.
Read Also: Ponnam Prabhakar: ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు..
Also Read
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
ఇక, 15 వ ఫైనాన్స్ కమిషన్ కు మాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. వైసీపీ హయాంలో 2023 లో 450 కోట్లు ఇస్తే వాటిని పక్కదారి పట్టించారని విమర్శించారు నారాయణ.. స్వచ్ఛ భారత్ లో 295 కోట్లు రావాలి, మాచింగ్ గ్రాంట్ 120 కోట్లు ఇవ్వలేదు.. మళ్లీ కూటమి ప్రభుత్వంవచ్చాక వాటిని వచ్చేలా చేసినట్టు వివరించారు. టీడీఆర్ కుంభకోణాలు మీద త్వరలో స్పష్టత వస్తుందన్నారు. సెప్టెంబర్ 13 న మరో 75 అన్న కాంటీన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!