రాజధాని నిర్మాణానికి 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయల రుణం కోసం సంప్రదింపులు జరిపాం.. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు..
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇప్పటికే అనుమతి లభించిన 45 వేల కోట్ల రూపాయల నిర్మాణాలకి రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి.. టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. అమరావతి మొత్తం ప్రాజెక్టు వ్యయం 62 వేల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రాజమండ్రిలో పర్యటనలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. వచ్చే ఏడాది జులైలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ…
ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా స్వాధీనం చెయ్యాలన్నారు.. లేదంటే ప్రభుత్వం ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు.