Site icon NTV Telugu

Simhachalam Tragedy: రూ.కోటి సాయంపై మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు

Vangalapudianitha

Vangalapudianitha

సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.

ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: గోడ కూలడానికి ప్రధాన కారణం ఇదేనా?

ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలు రూ.కోటి నష్టపరిహారం అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లాల్లోని ఎమ్మెల్యేలమంతా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిందని తెలిపారు. అంతేకాకుండా పిల్లల్ని ప్రభుత్వపరంగా చదవిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు. గోడ కూలిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అనిత హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: CPI Narayana: హైదరాబాద్‌లో అందాల పోటీతో స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దు

Exit mobile version