GVMC Mayor: గ్రేటర్ విశాఖ పట్నం మేయర్ మార్పు నల్లేరు మీద నడకగా భావించిన కూటమి పార్టీలకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకంపై జనసేనా, టీడీపీ మధ్య పీఠ ముడి పడింది.
మేయర్ పై అవిశ్వాస తీర్మానం తర్వాత గ్రేటర్ విశాఖ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. నోటీసులు ఇచ్చేసిన కూటమి సంఖ్యాబలం కోసం మల్లగుల్లాలు పడుతోంది. లెక్క తప్పితే పరువుపోతుందనే టెన్షన్ టీడీపీలో కలవరం పెంచేస్తుంటే.. క్యాంప్ పాలటిక్స్ మొదలెట్టిన వైసీపీ.. ఇది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని ధీమాగా కనిపిస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు…