GVL Narasimha Rao: జీవీఎల్ హాట్‌కామెంట్స్.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు..!
- జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్..
- ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉంది..
- కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..?
- విభజన సమయంలో ఏపీ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు.. 10 ఏళ్లు ఏపీ ప్రజలు ఇచ్చిన సీట్లతో అధికారం చేసి రాష్ట్రం గొంతు నులిమేశారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామంగా అభివర్ణించారు.
Read Also: Paris Olympics: నీరజ్ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్‌పై 30 దేశాలు దాటి పారిస్ కు
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
రాష్ర్ట విభజన తర్వాత ఏపీ నష్ట పోవడానికి.. రాజధాని లేకపోవడమే కారణం అన్నారు జీవీఎల్.. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం అన్న ఆయన.. ప్రధానిని కీలు బొమ్మను చేసి జనపథ్ నిర్ణయాలు అమలు చేసిన రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు.. అసెంబ్లీ, పార్లమెంట్ అయినా 10 శాతం సీట్లు రాకపోతే హోదా రాదు అంటూ వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు.. ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదన్నారు.. కోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చు.. కానీ, పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో పెద్దగా జోక్యం వుంటుందని అనుకోవడం లేదన్నారు.. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది అతి ఆలోచన.. రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు..
Read Also: Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?
ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది… క్రైసిస్ మేనేజ్ మెంట్ టీమ్ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు మాజీ ఎంపీ జీవీఎల్.. 3100 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ విధానంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందన్నారు.. మరోవైపు.. నాపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరి దగ్గరైనా నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా.. లేదంటే మాపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!