NTV Telugu Site icon

GVL Narasimha Rao: జీవీఎల్‌ హాట్‌కామెంట్స్.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు..!

Gvl

Gvl

GVL Narasimha Rao: బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్‌ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు.. 10 ఏళ్లు ఏపీ ప్రజలు ఇచ్చిన సీట్లతో అధికారం చేసి రాష్ట్రం గొంతు నులిమేశారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామంగా అభివర్ణించారు.

Read Also: Paris Olympics: నీరజ్‌ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్‌పై 30 దేశాలు దాటి పారిస్‌ కు

రాష్ర్ట విభజన తర్వాత ఏపీ నష్ట పోవడానికి.. రాజధాని లేకపోవడమే కారణం అన్నారు జీవీఎల్.. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం అన్న ఆయన.. ప్రధానిని కీలు బొమ్మను చేసి జనపథ్ నిర్ణయాలు అమలు చేసిన రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు.. అసెంబ్లీ, పార్లమెంట్‌ అయినా 10 శాతం సీట్లు రాకపోతే హోదా రాదు అంటూ వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు.. ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదన్నారు.. కోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చు.. కానీ, పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో పెద్దగా జోక్యం వుంటుందని అనుకోవడం లేదన్నారు.. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది అతి ఆలోచన.. రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు..

Read Also: Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?

ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది… క్రైసిస్ మేనేజ్ మెంట్ టీమ్ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు మాజీ ఎంపీ జీవీఎల్.. 3100 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ విధానంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందన్నారు.. మరోవైపు.. నాపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు.. ఎవరి దగ్గరైనా నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా.. లేదంటే మాపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.