Site icon NTV Telugu

Gudivada Amarnath: మేయర్‌పై అవిశ్వాసం గెలిశారు.. విశాఖ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్… విశాఖ మేయర్‌ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం ఖాయం అన్నారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మా నాయకుడు జగన్‌.. మేయర్ పదవి ఇచ్చారు.. కానీ, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారని మండిపడ్డారు.

Read Also: Ashwin- Dhoni: అశ్విన్.. ధోనీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.. ఎందుకిలా చేశాడబ్బా?

ఇక, 99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబడుతున్నారు. ఇదే తరహాలో భూముల కట్టబెడతామని మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు.. అసలు టీసీఎస్ విశాఖ రాకముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించారు.. విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలను చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్..

Read Also: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..

జీవీఎంసీ మేయర్‌ పై అవిశ్వాస పరీక్షపై స్పందించిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు.. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు.. విలువలు విశ్వాసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను జగన్ కూర్చోబెట్టారు.. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైసీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం అన్నారు.. జగన్ సీఎంగా ఉన్నా టీడీపీ గెలిచిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లాక్కోలేదన్నారు కురసాల కన్నబాబు..

Exit mobile version