Gudivada Amarnath: విశాఖలో భూ కేటాయింపులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెల్ కంపెనీల సృష్టికర్త చంద్రబాబు అని ఆరోపించారు. షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు.. ఉర్సా కంపెనీకి కార్యాలయం లేదు ఒక ఉద్యోగి లేడు.. ఫిబ్రవరి నెలలో కంపెనీ ఏర్పాటు చేస్తే ఏప్రిల్ లో భూములు కేటాయించారు.. విశాఖలో విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు నామమాత్రపు ధరకు కూటమి ప్రభుత్వం కట్టబెట్టేస్తోంది అని మండిపడ్డాడు. ఊరు పేరు లేని ఉర్సా సంస్థకు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమి కేటాయిస్తున్నారు.. ఈ కంపెనీకి భూ కేటాయింపులపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది అని అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Also: Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
అయితే, ఎన్డీయే కూటమి ప్రభుత్వ భూ కేటాయింపులపై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ తక్కువ రేటుకు భూములు కేటాయించడం మా విధానమని చెప్పారు.. ఈ పది నెలల్లో కేటాయించిన భూ కేటాయింపులపై అనేక అనుమానాలు ఉన్నాయి.. వాటన్నింటినీ బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.