Rape Case: విశాఖ పట్నంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ తండ్రి. ఈ ఘటన భీమిలిలోని తగరపువలసలో పాత కృష్ణ కాలేజ్ ఎదురుగా ఉన్న షాపు దగ్గర మద్యం మత్తులో ఉన్న తండ్రి అప్పన్న కన్న కూతురిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో.. సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్థానికులు అడ్డుకోని అతడికి దేహశుద్ది చేసిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఇక, రంగంలోకి దిగిన మహిళ ఏసీపీ పెంటా రావు అత్యాచారయత్నినికి పాల్పడిన ప్రదేశాన్ని పరిశీలించింది.
Read Also: Lokesh : ఆ స్టార్ హీరోతో మూవీ చేయడం లోకేష్ కనకరాజ్ గోల్ ..?
ఇక, నిందితుడు షిప్పింగ్ యార్డు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, మైనర్ బాలికను చికిత్స కోసం కేజీహెచ్ కి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. నిందితుడు అప్పన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.