పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్‌లను సాధించడానికి హీరోలతోపాటు దర్శకులు కూడా నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో సన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి ఊపేంద్ర ముఖ్యపాత్రలో నటించబోతున్నారు.. వీరితోపాటు పలువురు పాపులర్ యాక్టర్స్ ఇందులో నటించబోతున్నారు. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘విక్రమ్ 2’ సినిమాని లైన్ లో పెట్టాడు.
Also Read: Upendra : ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ‘45’ టీజర్ లాంఛ్..
అయితే ప్రతి ఒక్క దర్శకుడికి ఫేవరెట్ హీరో, డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఉంటుంది. అలా లోకేష్ కనకరాజ్ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అంటా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాగంగా ‘ఎంటైర్ కెరియర్‌లో ఒక్కసారైనా చిరంజీవితో సినిమా చేయాలని, ఒక భారీ సక్సెస్ సాధించాలని ఉంది’ అంటూ తెలిపాడు. అతను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలో చిరంజీవిని రంగంలోకి దింపుతాడా? లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ చేస్తున్న ‘కూలీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ తలైవాతో మూవీ అంటే మామూలు విషయం కాదు. ఆయన అభిమానులను తృప్తి పరచాలి అంటే సాహసంతో కూడుకుంది. మరి ఈ సవాల్ ని లోకేష్ ఎంత వరకు జయిస్తాడు చూడాలి.