School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన..
- అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు..
- విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వాన..
- వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటన..
- విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవు-జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈ శాన్యంగా 390 కిలోమీటర్లు.. విశాఖకు దక్షిణాన 430 కిలోమీటర్ల దూరంలో నెమ్మదిగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది.. గంటకు 5 కిలోమీటర్ల కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతుఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి..
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్మేశాయి.. ఇక, వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్..
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!