Cyclone Montha: విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం..
- విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్ బీభత్సం..
- ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి..
- 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్ పెడుతోన్న మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.. తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు.. తుఫాన్ తీరం తాకే సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. బోట్లు కొట్టుకు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జెట్టీల లోని సురక్షత ప్రాంతాలకూ బోట్లు తరలింపునకు పడరాని పాట్లు పడుతున్నారు మత్స్యకారులు..
Read Also: Prashant Kishor: బీహార్ ఎన్నికల వేళ అసదుద్దీన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సలహా
Also Read
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఇక, కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు..
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!