ముంబై తరహాలో ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేవీ డే సందర్భంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలను తిలకించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతమైనవి అన్నారు.. ఈస్ట్ కోస్ట్ లో ఎకనామిక్ యాక్టివిటీ పరిరక్షణ బాధ్యత నేవీ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు..
నేవీ డే సందర్భంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విశాఖలో నేవీ వేడుకలు అబ్బురపరిచాయి.. నేవీదళ విన్యాసానాలతో ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది.. శక్తి యుక్తులు ప్రదర్శించాయి అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు.. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో నిలిచింది..
గుంటూరు: నేడు విజ్ఞాన్ యూనివర్శిటీలో రైతు నేస్తం కార్యక్రమం. పాల్గొననున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన కార్యక్రమం. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పాల్గొననున్న మంత్రి లోకేశ్. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ. రైతు భరోసా విధివిధానాలకు ఆమోదం తెలపనున్న సర్కార్. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చలు. కొత్త ఇంధన పాలసీపై చర్చిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. నేడు విశాఖ ఆర్కే…
పర్యాటకులతో సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది. అత్యాధునిక యుద్ధనౌకలు, విమానాలు గర్జించాయి. శత్రువులపై చకచక్యంగా విరుచుకుపడే విన్యాసాలు అబ్బురపరిచాయి. హాక్ విమానాల ఎదురుదాడి నైపుణ్యం., యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు బాంబుల దాడి వంటివి అబ్బురపరిచాయి.