Revenue Sadassulu: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా..
- రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు..
- రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు..
- భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revenue Sadassulu: రెవెన్యూ సదస్సులకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్టు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు డిసెంబర్ 6, 2024 – జనవరి 8, 2025 వరకు నిర్వహిస్తామన్నారు.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా స్పష్టం చేశారు.. ప్రతి మండలంలో.. ఒక గ్రామంలో.. రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించబడతాయన్నారు. తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ VRO, మండల సర్వేయర్ వంటి అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.. అవసరమైతే ఇతర శాఖల అధికారులను కూడా పిలుస్తారని వివరించారు.
Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస.. ఇళ్లను వదిలివెళ్లిన కుటుంబాలు
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
ఇక, ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు అయ్యన్నపాత్రుడు.. గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.. ప్రజలు తమ సమస్యల డాక్యుమెంట్లు, దరఖాస్తులు తీసుకురావాలి.. రశీదు ఇవ్వబడుతుందన్నారు.. 45 రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుంది.. సభల అనంతరం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం పరిశీలించి నివేదిక అందజేస్తుంది.. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
తాజావార్తలు
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!