APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2026: ఏపీఎల్ 2026 సీజన్-5లో అమరావతి రాయల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో రోజు తొలి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన అమరావతి జట్టు 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన తుంగభద్ర వారియర్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. అమరావతి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తుంగభద్ర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేయగలిగారు. ఇన్నింగ్స్ మొత్తం తుంగభద్ర జట్టు సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోతూ 15.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేయగలిగారు. అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. యశ్వంత్ వెంకట్, శశికాంత్ బండారు, అయ్యప్ప చెరో రెండు వికెట్లు తీసి తుంగభద్ర జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఇక, 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పవర్‌ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి విజయానికి బాటలు వేసుకుంది. తుంగభద్ర బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అమరావతి బ్యాటర్లు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఎస్వీ రాహుల్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు వై సందీప్ కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అతను నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. వీరిరువురి దూకుడు బ్యాటింగ్‌తో అమరావతి రాయల్స్ 11 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో 9 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించి సీజన్లో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో తుంగభద్ర వారియర్స్‌ను కంగుతినిపించిన టోషిత్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయనకు అవార్డును అందజేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..