CP Ravi Shankar Ayyanar: వార్షిక క్రైమ్ రివ్యూ.. గతంతో పోలిస్తే 30 శాతం క్రైమ్ రేట్ తగ్గింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందని విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యనార్ అన్నారు. శుక్రవారం ఆయన వార్షిక క్రైం రేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే 30 శాతం క్రైం రేట్ తగ్గిందన్నారు. కానీ, సైబర్ క్రైం రేట్ పెరిగిందని చెప్పారు. అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై దాడులు కసులు తగ్గాయని, దిశ ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరంలో 27 హత్యలు జరిగాయి. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు, ఆవేశంలో చేసిన హత్యాలే అధికంగా ఉన్నాయి.
Also Read: Lok Sabha Election 2024: ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Also Read
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారింది. 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో మహిళా పోలీసులని అభినందిస్తున్నాను. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా కేసులు ఇక్కడే కంప్రమైస్ అవుతున్నాయి. మహిళా పోలీసులు అన్ని అంశాలపై పాఠశాలల్లో అవగాహనా కల్పిస్తున్నారు. గంజాయి రవాణాకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్నారు. గంజాయి సాగుని పూర్తిగా ధ్వంసం చేసాం. ఒరిస్సా నుంచే ఎక్కువ గంజాయి విశాఖ వచ్చి వేరే రాష్ట్రలకు వెళుతుంది. ఈ రవాణాను నివారించేందుకు పటిష్టంగా పని చేయబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఇక్కడ గంజాయి వాడకం తగ్గింది. 2022 లో 39 మర్డర్ కేసులు నమోదు కాగా 2023 లో 24 మర్డర్ కేసు లు నమోదు అయ్యాయి.
Also Read: Sonia Gandhi: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా!
2022లో 42 కిడ్నాప్ కేసులు నమోదు కాగా..2023 లో 18 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. 2022 లొ 127 అత్యాచారం కేసులు నమోదు కాగా 2023 లో 78 కేసులు నమోదు అయ్యాయి. 2022 లో 65 అటెంపెట్ టు మర్డర్ కేసులు నమోదు కాగా.. 2023 లో 47 అటెంపెట్ టు మర్డర్ కేసులు నమోదు అయ్యాయి. 2022 లో 841 వైట్ కలర్ క్రైమ్ కేసులు నమోదు కాగా. 2023 లో 723 వైట్ కలర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి. వర కట్నం వేధింపుల వలన మృతి చెందిన కేసులు 2022 లో 6 కాగా 2023 లో 7 కేసులుగా నమోదయ్యాయి. 498-A సెక్షన్ల కింది కేసులో 2022లో 714గా ఉండగా.. 2023లో 479గా నమోదయ్యాయి’ అని సీపీ వివరించారు.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!