MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, పార్టీ కేడర్ జోలికి వస్తే మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయ్యేలోపు సినిమా చూపిస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమపై రెచ్చగొట్టి రాళ్లు వేయించారని మిథున్రెడ్డి ఆరోపించారు. పుంగనూరు ప్రశాంతంగా ఉండాలని, గొడవలు వద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారని తెలిపారు. తనపై అనేక కేసులు పెట్టి జైలులో పెట్టినా.. తాము ఎప్పుడూ ఎవరినీ రెచ్చగొట్టలేదన్నారు. రాళ్లు వేసిన వారిని కూడా అమాయకులుగానే భావిస్తున్నామని.. ఎవరో చెప్పిన మాటలు విని అలా చేసి ఉంటారని ఇంట్లో మాట్లాడుకున్నామని చెప్పారు.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులంతా కలిసికట్టుగా పోరాడి పార్టీని భారీ స్థాయిలో గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంపీ మిథున్రెడ్డి..గతంలో ఏ ప్రభుత్వం కూడా పుంగనూరు గురించి ఆలోచించలేదని.. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ హయాంలో పలు ప్రాజెక్టులు సిద్ధం చేశామని తెలిపారు. టీడీపీ నాయకులకు పుంగనూరుపై సవతి తల్లి ప్రేమ మాత్రమే ఉందని మిథున్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిందని.. కనీసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే పరిస్థితిలో కూడా టీడీపీ ప్రభుత్వం లేదంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ మిథున్ రెడ్డి..
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..