NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Health University: రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీకి NAACలో మొదటి ర్యాంక్ రావడం గర్వకారణమని తెలిపారు. ఏపీలో ఫ్యామిలీ మెడిసిన్ అందుబాటులోకి వచ్చిందని, వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేక వైద్య సేవలు మరింత అవసరమవుతున్నాయని చెప్పారు. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్సును కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేసిన వైద్యుల అవసరం రాష్ట్రంలో పెరుగుతోందని డాక్టర్ లోకేష్ తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారి సంఖ్యకు, పీజీ సీట్లకు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. మెడికల్ లెర్నింగ్‌లో మనం ఇంకా వెనుకబడి ఉన్నామని, హెల్త్‌కేర్‌ను మరింత మెరుగుపర్చాలంటే పీజీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి మెడికల్ కాలేజీ నుంచి రీసెర్చ్ పబ్లికేషన్స్, జర్నల్స్ వెలువడేలా ప్రోత్సహించాలని డాక్టర్ లోకేష్ సూచించారు. వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యం పెంచితేనే వైద్య రంగంలో మరింత నాణ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ పూర్తి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ మాట్లాడుతూ.. అన్ని కోటాల్లోని ఎంబీబీఎస్ మెడికల్ సీట్ల ప్రక్రియను సెప్టెంబర్ 2లోగా పూర్తి చేశామని తెలిపారు. నిన్న సాయంత్రానికి ఫేజ్-1 కౌన్సెలింగ్ కూడా పూర్తయిందన్నారు. ఆల్ ఇండియా కోటాలో సెప్టెంబర్ 19లోగా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఎన్ని కాలేజీలను ఆప్షన్‌గా ఎంచుకోవాలన్నది వారి హక్కు అని డాక్టర్ సాయిసుధీర్ స్పష్టం చేశారు. కాలేజీల ఆప్షన్ల విషయంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వానికి వినతి చేశామని తెలిపారు. మెరిటోరియస్ రిజర్వేషన్ అభ్యర్థుల నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
జీవో 102పై ఆందోళన అవసరం లేదు
జీవో 102 విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారని డాక్టర్ సాయిసుధీర్ తెలిపారు. ఈ జీవో వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారి సంఖ్య 70 మంది ఉండే అవకాశం లేదని చెప్పారు. ఆప్షన్ల విషయంలో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. కచ్చితంగా మెడికల్ సీటు పొందాలంటే విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ కాలేజీలను ఆప్షన్లుగా పెట్టుకోవాలని సూచించారు. కాలేజీల ఆప్షన్లకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. జీఓ 102పై స్టే ఇవ్వాలన్న అంశాన్ని కోర్టు అంగీకరించలేదని, దీనిపై తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..