AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..

Municipal Election Results

Municipal Election Results

AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. జగ్గయ్యపేట, ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీల్లో కూటమి చైర్మన్ అభ్యర్థులు విజయం సాధించారు. జగ్గయ్యపేట, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో టీడీపీ చైర్మన్ అభ్యర్థులు గెలుపొందగా, పెడన మున్సిపాలిటీలో జనసేన చైర్మన్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో కూటమి తన పట్టును నిలబెట్టుకుంది.

మరోవైపు నందిగామ, కొండపల్లి, తిరువూరు, నూజివీడు మున్సిపాలిటీల్లోనూ కూటమి చైర్మన్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లలోనూ కూటమి మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్సిపాలిటీల నుంచి కార్పొరేషన్ల వరకు కూటమి అభ్యర్థులు పైచేయి సాధిస్తుండటంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు హవా కొనసాగుతోంది..