Kishan Reddy: ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నీస్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నీస్ రికార్డు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. జనరల్ బడ్జెట్ లో రైల్వేను విలీనం చేసి.. ఆర్ధికపరమైన సహకారం మోడీ అందిస్తున్నారని తెలిపారు. డిజిటల్ అడ్వాన్స్ టెక్నాలజీ తో రైళ్లు నడుపుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే రైల్వే నెట్ వర్కులో భారత్ నాలుగో స్థానంలో ఉందన్నారు. రైల్వే మన దేశ సమగ్రత కు అద్దం పడుతుందని తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దున్నామని తెలిపారు. 508 ర్వైల్వే స్టేషన్లను అమృత్ పధకంలో భాగంగా అభివృద్ది చేసేందుకు మోడీ భూమి పూజ చేశారు. ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నీస్ రికార్డు అన్నారు. ఈ పనుల కోసం 25వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు మొదలయ్యాయని తెలిపారు. సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రపంచంలో మొదటి సారిగా స్వదేశీ టెక్నాలజీతో మనం నడిపామని తెలిపారు. కొంతమంది మూర్ఖులు ఈ ప్రక్రియను అవమానించారు.. వక్రీకరించారని మండిపడ్డారు. వాటిని అధిగమించి వందే భారత్ రైళ్లు నేడు అద్భుతంగా నడుస్తున్నాయన్నారు. గంటకు వంద కిలోమీటర్లు వేగంతో వెళ్లే విధంగా భద్రత, సౌకర్యాలతో రైళ్లు నడుస్తున్నాయన్నారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
వందే భారత్ తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశామన్నారు. ఐదు వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం సాగిస్తాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయని తెలిపారు. 2018-23 వరకు మూడు లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా అభివృద్ది చేస్తున్నాం.. స్థలం కేటాయింపుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని తెలిపారు. దేశంలో ప్రతి రోజూ రెండు కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. యేడాదికి 800కోట్లు మంది ప్రయాణించే ప్రధాన రవాణా సాధనం రైల్వే అన్నారు. 1200 ప్యాసింజర్ రైళ్లు మనకు ఉన్నాయని, ప్రజలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చామన్నారు. మోడీ సారధ్యంలో 85,434 కిమీ రైల్వే నెట్ వర్కు కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఇది జర్మనీలో ఉన్న పూర్తి రైల్వే నెట్ వర్కుకు సమానమన్నారు. 2004 లో యూపీఎ హయాంలో రైల్వే బడ్జెట్ 8వేల కోట్లు, 2014 లో 29 కోట్లు మాత్రమే అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు 2.40లక్షల కోట్లుకు బడ్జెట్ పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా 70శాతం పెరిగిందని తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు 38,650 కోట్లు కేవలం రైల్వే విద్యుద్దీకరణ కోసం ఖర్చు చేసిందన్నారు. ప్రజలు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపైనే మోడీ ఆలోచనలు, ఆచరణ అనేది అందరూ తెలుసుకోవాలన్నారు. కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Ukrainian: భారత్ సాయం కోరిన ఉక్రెయిన్.. స్పందించని మోడీ సర్కార్
తాజావార్తలు
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?