విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్‌ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని..