Jogi Ramesh: సిట్‌ను పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు కోరాలి.. అప్పుడే నకిలీ మద్యం కేసులో ఆయనకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్.. నకిలీ మద్యం వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. కేసులో అసలు నిందితులను పట్టుకోవడం కోసం సిట్ వేశారని విమర్శించారు.. ఈ సిట్ చంద్రబాబు గుప్పిట్లో ఉండే సిట్ అని పేర్కొన్నారు.. చంద్రబాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని.. సిట్ ను పక్కన పెట్టి చంద్రబాబు సీబీఐ దర్యాప్తు కోరాలి అని డిమాండ్ చేశారు జోగి రమేష్..
నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ రావు విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోన్న విషయం విదితమే… వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు అంగీకరించారు జనార్ధన్ రావు.. అయితే, టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని పేర్కొన్నాడు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని.. టీడీపీ ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించడానికి మళ్లీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు అని వెల్లడించారు.. పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పజెప్పుతున్నాను. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారని.. ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా.. కానీ, జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం అని వీడియోలో వెల్లడించారు.. సీఎం చంద్రబాబు.. టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు.. మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం.. సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు.. ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ముందు రోజే అన్ని తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు.. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు అని పేర్కొన్నాడు జనార్దన్ రావు.. అనుకున్నది అంతా జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.. అంతా బాగా జరిగింది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు.. అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు.. నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడు.. అని సంచలన విషయాలు బయటపెట్టాడు జనార్ధన్ రావు..