Free Bus Travel In AP: రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తాం.. జిల్లాలు ధాటి ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సులలో అనుమతి ఉంటుంది.. ఏసీ బస్సులు, కొన్ని సేవలు మినహాయిస్తే అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచిత రవాణా లభిస్తుందన్నారు. ఆక్యుపెన్సీ 100శాతం పెరిగిపోయే అవకాశం ఉంది.. బస్సుల నిర్వహణ, అవసరాలకు తగ్గట్టుగా బస్సులను రెడీ చేశాం.. టిక్కెట్లు జారీ చేసినప్పుడు మొత్తం టికెట్ ధర.. కాన్సేషన్ పోగా జీరో ఫెయిర్ గా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. వెయ్యి అదనపు బస్సులు అందుబాటు లోకి వచ్చాయి.. త్వరలో పల్లె వెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్బస్సులు ప్రవేశ పెడతామని ద్వారాక తిరుమలరావు చెప్పుకొచ్చారు.
Read Also: Minister Satya Prasad: పవన్ ఏం అయ్యారో.. ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు..
అయితే, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావడం తప్పనిసరి.. భవిషత్తులో స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంది.. ఏపీ మహిళలు అయితే ఉచిత బస్సుకు అర్హులు అని తెలిపారు. ఫ్రీ బస్సు విధానం వల్ల మెయింటనెన్స్ భారం పడుతుంది.. రోజూ 89 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీలో జర్నీ చేస్తారు.. ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు రోజూ ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా.. ఉచిత విధానంతో 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. అయితే, తిరుపతి – తిరుమల వెళ్ళే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదని తేల్చి చెప్పారు. ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం లభించదని ద్వారక తిరుమలరావు వెల్లడించారు.