Free Bus Travel In AP: ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావడం తప్పనిసరి.. భవిషత్తులో స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంది.. ఏపీ మహిళలు అయితే ఉచిత బస్సుకు అర్హులు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కావాలి అని ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళ లకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలి.. టికెట్ పై…