Deputy CM Pawan: నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మాటామంతి కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయితీల ప్రజలతో మాట్లాడనున్నారు. గ్రామాల్లోని తాగు నీరు, సాగు నీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలపై కీలక చర్చ కొనసాగనుంది. చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. టెక్కలి నియోజకవర్గం రావివలస గ్రామాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. అయితే, రావివలసలో సామాజిక ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలను చేపట్టారు. పైలట్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారు.