Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..
- రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు..
- ఆ స్థలం మార్చాలని కోరినా స్పందించలేదు..
- ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు..
- ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్న పురంధేశ్వరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: సీఎం చంద్రబాబుకు కేంద్ర లేఖ రాసింది.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్నారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో సమావేశం అయిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానం అన్నారు.. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు.. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు వంటి అంశాలను మోడీ ధైర్యంగా అమలు చేశారు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు..
Read Also: Chiranjeevi: ఆయన మరణం తీవ్ర మనోవేదనకు గురిచేసింది: చిరంజీవి
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది అని మరోసారి స్పష్టం చేశారు పురంధేశ్వరి.. 2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసింది.. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20 వేల కోట్లు.. డీపీఆర్ ఓకే చేశారు.. ఇంటర్నల్ రోడ్ల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు.. అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని తెలిపారు.. పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నం అయ్యాయి.. నిర్మాణం అయిన డయాఫ్రంవాల్ దెబ్బ తినడం బాధాకరం అన్నారు. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదు.. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం ఇస్తుందన్నారు.. ఏపీ అభివృద్ది కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.. కూటమి ప్రభుత్వం సారధ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయం అని తెలిపారు పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!