Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayana: ప్రశ్న రావణ్‌పై కేసు విషయంలో తీవ్రంగా మండిపడ్డారు సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ.. త్రేతాయుగంలో రావణుడు విలన్‌గా చూపించారు.. కానీ, కలియుగంలో రావణ్‌ను హీరో చేశారని పేర్కొన్నారు.. ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసులను తీవ్రంగా తప్పుబట్టారు నారాయణ.. మిమిక్రీ చేయడం లేదా రాజకీయ నాయకుల మాటతీరును అనుకరించడం నేరంగా పరిగణించరాదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన శైలినే రావణ్ అనుకరించాడని, అలాంటి సందర్భంలో ముందు పవన్‌పైనే కేసు పెట్టాలా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఎంతోమంది రాజకీయ నాయకులను మిమిక్రీ ద్వారా అనుకరిస్తారు.. మిమిక్రీ చేసిన వారందరి పైనా కేసులు పెడతారా? అని నిలదీశారు..
రావణ్‌పై నమోదైన కేసుల్లో పలు కోర్టులు రిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ, వరుసగా కొత్త కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నారాయణ అభిప్రాయపడ్డారు. చట్టాల్లోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని, అధికార యంత్రాంగం.. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాలు వ్యవస్థను, సమాజాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చట్టాల అమలులో సమతుల్యత అవసరమని పేర్కొన్నారు నారాయణ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందుకు లక్ష్మణరేఖను దాటుతున్నారు..? అని ప్రశ్నించారు.. రాజకీయ నాయకులు చెప్పిన పనులను చేయనని చెప్పొచ్చు కదా? అని సూచించారు.. రాజకీయ నాయకులు చెడిపోయి వ్యవస్థను, ప్రజలను కూడా చెడగొట్టేస్తున్నారు అని ఫైర్ అయ్యారు సీపీఐ జాతీయ నేత నారాయణ..
Also Read
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!