CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.. అయితే, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బనకచర్లతో ఎవరికీ నష్టం జరగదు.. గోదావరి వృథా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం.. బనకచర్ల ద్వారా గోదావరి వృథా జలాలు రాయలసీమకు మళ్లించాలని నిర్ణయించాం అన్నారు.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం.. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. సముద్రంలోకి వృథా అవుతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వినియోగించుకుంటే తెలంగాణకి అభ్యంతరం ఏంటి..? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: MLA Nandamuri Balakrishna: హిందూపురం అభివృద్ధిపై బాలయ్య కీలక వ్యాఖ్యలు
ఇక, 2024లో ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు.. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు… సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం.. 5 సంతకాలతో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునే ప్రజా సేవలో ఉన్నాం.. సంక్షేమ రాజ్యానికి కొత్త అర్ధాన్ని ఇచ్చాం అన్నారు సీఎం చంద్రబాబు.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గిస్తే మేం తిరిగి 34 శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నాం. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు రూ.98,000 సబ్సిడీ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో చోటు కల్పించాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్లు కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్లు కేటాయించాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని ఇస్తున్నాం.. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్లు అందించాం.. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్ కి నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5 శాతం రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు సాయంగా ఇస్తాం. వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 10 శాతం కేటాయిస్తాం. కురబలకు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాథి కల్పిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు, అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం. ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం అన్నారు చంద్రబాబు..
Read Also: Pilot Rohith Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. త్వరలోనే తాండూరుకు వస్తా!
గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం.. వారి హక్కులు కాపాడుతూ… వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం. ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో రూ.20,281 కోట్లు కేటాయించాం అన్నారు చంద్రబాబు.. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా… ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం. సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం. ఆదాయ మార్గాన్ని చూపిస్తాం అన్నారు.. ఇక, ఆశావర్కర్ల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాం. 43 వేల మంది ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ గరిష్టంగా రూ.1.50 లక్షలు పొందేలా చేశాం.. చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు కావాలన్నా రేషన్ సరుకుల్ని తీసుకునా వీలు కల్పించాం. MDU వాహనాల రద్దుతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేశాం. 18 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ప్రతీ నెలా 26వ తేదీ నుండి రేషన్ ఇంటి వద్ద అందిస్తున్నాం. 2029 నాటికి అందరికీ సొంతిల్లు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఉచితంగా ఇస్తాం.. పూర్తయిన 3 లక్షల ఇళ్లు త్వరలో లబ్దిదారులకు అందిస్తాం. మరో 6 లక్ష ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాం. వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి… రైతుల ఆదాయం పెరగాలి ఆ సంకల్పంతో పనిచేస్తున్నాం అన్నారు..
Read Also: Pilot Rohith Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. త్వరలోనే తాండూరుకు వస్తా!
మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణం. డిమాండ్ ఉన్న పంటల సాగు జరగాలి. ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి… ప్రకృతి సాగు దిశగా రైతు అడుగెయ్యాలని సూచించారు చంద్రబాబు. ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకుందాం. ప్రపంచ మార్కెట్లకు ఆర్గానిక్ పంటలను ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడదాం.. ఆర్థికంగా కష్టాలున్నా రైతును బలోపేతం చేసేందుకు ‘అన్నదాత సుఖీభా పీఎం కిసాన్’ ప్రారంభించాం. ధాన్యం కొనుగోలు చేసి రూ.13,584 రైతులకు 24 గంటల్లోనే చెల్లించాం. గత ప్రభుత్వం నిలిపేసిన డ్రిప్ సబ్సిడీలు, యాంత్రీకరణ సబ్సిడీలు ఈ ప్రారంభించాం. సాగులో సాంకేతికతను తీసుకువచ్చాం. ఖర్చు తగ్గేలా డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ సేవలను వ్యవసాయా వినియోగిస్తున్నాం. అవేర్ ద్వారా వాతావరణ పరిస్థితులపై రైతులను అప్ర చేస్తున్నాం అన్నారు.. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులను కూడా భాగస్వాములు చేయడం ద్వారా పేదరికాన్ని పోగొట్టాలనే ఆశయంతో పనిచేస్తున్నాం. ఇందుకోసం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాం అని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..