CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. విజన్ 2047 కోసం పనిచేస్తున్నా..
- స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను..
- విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు..
- ఇప్పుడు అర్థం అవుతోందన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు.. కానీ, ఇప్పుడు అర్థం అవుతోందన్న ఆయన.. ఇప్పుడు తాను విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అన్నారు.. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యం.. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యం.. స్వామీజీ పై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన నాపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తాం.. అందరూ యదార్థములని కూడా చెప్పేలా ఉండాలి అన్నారు..
Read Also: BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
ఇక, ప్రతి ఒక్కరికీ స్పిరిచువాలిటీ ఉండాలి అన్నారు సీఎం చంద్రబాబు.. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలి.. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు.. నేను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని నా చేతికి ఇచ్చారు.. మంచికోసం స్వామీజీ పరితపిస్తారు.. స్వామీజీని ఎప్పుడు కలిసినా మనశ్శాంతి దొరుకుతుందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పీఠాధితుల ఆశీర్వచనం తీసుకున్నారు.. ఆ తర్వాత 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
Read Also: MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే..
మరోవైపు సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు గణపతి సచ్చిదానంద స్వామి .. కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను.. చంద్రబాబు ఒక కర్మ యోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం. చంద్రబాబుకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.. చంద్రబాబు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధి చేయటానికి, చంద్రబాబుకి సమయం ఇవ్వండి. చెడు చేయాలి అంటే వెంటనే చేయొచ్చు, మంచి చేయటానికి సమయం పడుతుందని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.. నిన్నటి వరకు మీ రాజ్యం ఏది అంటే, ఏమి చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి రాజధాని వచ్చింది. నా అమరావతి రాజధాని అని ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను అని వ్యాఖ్యానించారు గణపతి సచ్చిదానంద స్వామి..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!