Vijawada : పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింక్.. వెలుగులోకి కీలక విషయాలు..!
- విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింక్
- ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద సానుభూతిపరులతో లింక్‌లు
- ఢిల్లీ, రాజస్ధాన్, బీహార్, తెలంగాణాకు వెళ్లిన ప్రత్యేక బృందాలు
- మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఉన్న 42 మందితో ఒక గ్రూప్ ఏర్పాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో ఉగ్రవాద సానుభూతిపరుల కదలికలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఐసిస్ (ISIS) భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, దేశ భద్రతకు విఘాతం కలిగించేలా కుట్రలు పన్నుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ బెగ్లకు విజయవాడ సిఎంఎం (CMM) కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ఉగ్రవాద వ్యతిరేక దళాలు జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యువకులు ‘ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక జిహాదీ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సుమారు 42 మంది సభ్యులతో కూడిన ఈ గ్రూప్ ద్వారా ఐసిస్ , కిలాఫత్ ఐడియాలజీని ప్రచారం చేస్తున్నారు. వీరి నెట్‌వర్క్ కేవలం ఏపీకే పరిమితం కాకుండా ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు తెలియడంతో, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరాయి.
ముజాహిదీన్‌ల మాదిరిగా ముఖానికి మాస్క్‌లు ధరించి ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఆడియో క్లిప్పింగ్‌లు, పోస్ట్‌లు పెట్టడం వంటివి వీరి ప్రధాన పనిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఉంచి ఫొటోలు తీయడమే కాకుండా, దేశాన్ని **’ఇస్లామిక్ స్టేట్’**గా మార్చాలనే వివాదాస్పద సంభాషణలు చేసినట్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ద్వారా ఆధారాలు లభించాయి. విదేశాల్లో ఉన్న ఉగ్రవాద మూకలతో నిరంతరం టచ్‌లో ఉంటూ, పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్‌లలో మిలిటెంట్ శిక్షణకు వెళ్లాలని స్థానిక యువతను వీరు ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు , ఇతర కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ, దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి జిహాదీ గ్రూపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో, తమ పిల్లలు ఇంటర్నెట్ , సోషల్ మీడియాలో ఎటువంటి గ్రూపుల్లో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని, టెర్రరిజం వైపు వెళ్లకుండా వారిని జాగ్రత్తగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏపీ పోలీసులు , జాతీయ దర్యాప్తు సంస్థలు ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం వేటను ముమ్మరం చేశాయి.
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!