IPL 2026 RCB Jersey No.11: నెం.11 జర్సీతో మైదానంలోకి RCB ఆటగాళ్లు.. వారికోసం ప్రత్యేకంగా 11 సీట్లు రిజర్వ్..!
- ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబి కీలక నిర్ణయం
- 2025లో జరిగిన తొక్కిసలాట ఘటనస్మరించేందుకు..
- ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో ధరించనున్న జెర్సీ నంబర్ 11
- మ్యాచ్ సమయంలో మాత్రం సాధారణ జెర్సీలతోనే బరిలోకి
- చిన్నస్వామి స్టేడియంలో శాశ్వతంగా 11 సీట్లు రిజర్వ్ చేయాలని యోచన
- ఈ సీట్లు మరణించిన అభిమానులకు అంకితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 RCB Jersey No.11: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబి యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ఏడాది జరిగిన విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించేందుకు ఫ్రాంచైజీ ప్రత్యేక కార్యక్రమాలను తీసుకవచ్చింది. ఈ నిర్ణయం క్రీడాభిమానుల మనసులను హత్తుకునేలా ఉంది.
SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
2025 జూన్ 4న చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఆర్సీబి (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సమయంలో ఏర్పడిన గందరగోళం వల్ల చోటుచేసుకుంది. ఆ సందర్భంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఫ్రాంచైజీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఆ బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంటూ.. జట్టు యాజమాన్యం చనిపోయిన వారి కోసం వినూత్నంగా నివాళి అర్పించేందుకు సిద్ధమైంది.
మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్ సెషన్ సమయంలో అందరు ఆటగాళ్లు జెర్సీ నెం.11 ధరించనున్నారు. ఆ తర్వాత మ్యాచ్ లో మాత్రం వారు తమ సాధారణ జెర్సీలతోనే ఆడతారు. ఈ విషయాన్ని ఆర్సీబి సీఈఓ రాజేష్ మీనన్ వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మ్యాచ్‌కు ముందు జరిగే ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లంతా నంబర్ 11 జెర్సీతో కనిపిస్తారని.. అలాగే అందరూ నల్ల కళ్లద్దాలు కూడా ధరిస్తారని ఆయన అన్నారు.
వీటితోపాటు చిన్ని స్వామి స్టేడియంలో శాశ్వతంగా 11 సీట్లను కేటాయించే యోచనలో ఫ్రాంచైజీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సీట్లు ప్రాణాలు కోల్పోయిన ఆ 11 మంది అభిమానులకు అంకితం చేయనున్నారు. ఆ మరణించిన అభిమానులు ఎప్పటికీ మనతో ఉంటారు అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్యతో క్రీడల్లో విజయం మాత్రమే కాదు, అభిమానుల విలువ కూడా ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.
VIDEO | IPL 2026: RCB to honour stampede victims. Players to train with No. 11 jersey, franchise looking to reserve 11 seats permanently, says CEO Rajesh Menon.#IPL2026 #RCB
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/8Ycv9C3j2Z
— Press Trust of India (@PTI_News) March 24, 2026
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!