ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎంపీ లనే చంద్రబాబు బిజెపిలోకి పంపించాడని.. వైసీపీ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడని నిప్పులు చెరిగారు. “సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బిజెపిలోకి పం పించాడు. దానిపై ఒక్క మాట…