Yogi Vemana University: వేమన వర్శిటీలో వైఎస్ విగ్రహం వివాదం.. వీసీ ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పు వివాదాస్నదం అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి.. డా.వైఎస్ ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం స్వంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో మరో వివాదం రచ్చరేపుతోంది. కడప యోగి వేమన యూనివర్శిటీలో ప్రజా కవి యోగి వేమనకు అవమానం జరిగిందని, నిర్లక్ష్యంగా గేటు పక్కన పెట్టారన్న ఆరోపణలను ఖండించారు యోగివేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి. వరల్డ్ క్లాస్ యూనివర్శిటీ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో యూనివర్శిటీ ప్రాంగణంలో ఉన్న ప్రజా కవి యోగివేమన విగ్రహాన్ని ఎలివేషన్‌లో తరలించామన్నారు. అందులో భాగంగా ఆయనకు ఆగ్రతాంబూలం ఇస్తూ చేసిన మార్పులపై మొన్నటి న్యాక్ కమిటీ కూడా అభినందిస్తూ, ఈ మార్పులను స్వాగతించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
Read Also: Exclusive: అనూష శెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం…
Also Read
యోగి వేమన పట్ల యూనివర్సికి ఎంతో గౌరం ఉందని, ఆయన పట్ల చిన్న తప్పు కూడా చేయమని ఆమె అన్నారు. యోగివేమన తరువాత, ఈ యూనివర్శిటీ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని యూనివర్శిటీ క్యాంపస్‌లో ఒక చోటి నుంచి ప్రస్తుతం యోగివేయన విగ్రహం ఉన్న చోట ఏర్పాటు చేసి గౌరవించామే తప్ప ఇందులో ఎవరినీ తక్కువ చేయడం మరోటి కాదని విసి సూర్యకళావతి స్పష్టం చేశారు. చాలా యూనివర్శిటీల ఎలివేషన్‌లో ఆ యూనివర్శిటీ పేరు ప్రతిబింబించేలా ఆయా వ్యక్తులు, మహానుభావుల విగ్రహాలు పెట్టారని,అదే పద్దతిని కొత్త ఎలివేషన్‌లో తామూ పాటించామని వీసీ వివరించారు.
Read Also: Drunken Elephants: ఇప్ప సారా తాగిన ఏనుగుల గుంపు..ఆ తరువాత ఏం జరిగిందంటే..
ప్రస్తుతం వేమన విగ్రహం తొలగించిన స్థలం వైఎస్ ఆర్ అడ్మినిస్ట్రేటువ్ బ్లాక్‌కు దగ్గర్లో ఉండటంలో సైన్స్ బ్లాక్ దగ్గర ఉన్న వైఎస్ విగ్రహాన్ని చోటు మార్చామన్నారు. అయితే విగ్రహం మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాయలసీమ విద్యార్ధి సంఘం కార్యదర్శి మల్లెల జగదీష్, యూనివర్సిటీ బయట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కింద కాకుండా కాస్త ఎత్తులో ఏర్పాటు చేయాలని కోరారు. కిందకు పెట్టడం వల్ల యోగి వేమనను అవమానించినట్లు అవుతుందని చెప్పారన్నారు వీసీ కళావతి. యోగి వేమన విషయంలో వస్తున్న వార్తలపై ఆమె ఈ విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్‌సభ స్పీకర్‌తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
-
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా హిస్టరీ
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్‌ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!