Andhra Pradesh: టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలిసిన వసంత నాగేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన కేశినేని నాని కలిసి పలు విషయాలపై చర్చించారు. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు కేశినేని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Distribution of Ration: పండుగొచ్చె.. కానీ రేషన్ ఎస్తలే..
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
కాగా గతంలో ఎన్టీఆర్ వంటి ఓ మహనీయుడు పేరు మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని జగన్ ప్రభుత్వాన్ని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. అటు నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు కేశినేని నాని అని వసంత నాగేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మరోసారి తలనొప్పి తెచ్చి పెట్టినట్లయింది. అయితే తండ్రి వ్యాఖ్యలకు కుమారుడు కృష్ణప్రసాద్ ఇటీవల కౌంటర్ ఇచ్చారు. వాగే నోరు, తిరిగే కాలు ఆగదు అన్నట్లుగా తన తండ్రి కూడా అంతేనని.. అవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!