వర్షాల ఎఫెక్ట్‌తో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి… నిన్న మొన్నటి వరకు కిలో టమాటా వందకు పైగా పలకగా… ఇప్పుడు వంకాయ వంతు వచ్చింది.. హోల్‌సెల్ మార్కెల్‌లోనే కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది…