హీరోయిన్లుగా ప్రొజెక్ట్ కావడానికే ఎక్కువగా ఇష్టపడే భామలు. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు కూడా సై అంటున్నారు. బాగా క్లిక్ కావడంతో పాటు కెరీర్ పరంగా గ్రోత్, క్రేజ్, ఆఫర్స్ వస్తుండటంతో ఏమాత్రం స్పెషల్ సాంగ్స్‌కు అడ్డు చెప్పడం లేదు. స్టార్ హీరోయిన్‌గా చేతినిండా సినిమాలుండగానే.. ఈ ప్రత్యేక మైన పాటలకు కాలుకదుపుతున్నారు. పూజా హెగ్డే, సమంత, కాజల్, తమన్నా, శ్రీలీల రీసెంట్లీ కేతిక శర్మ వరకు ప్రత్యేక మైన పాటల్లో పిచ్చెక్కించారు. ఇప్పుడు మరోసారి తమన్నా, క్యాథరిన్ స్పెషల్ సాంగ్స్‌లో గత్తర లేపేందుకు రెడీ అయ్యారు.
Also Read : WamiqaGabbi : వావ్ అనిపిస్తున్న వామిక గబ్బి లేటెస్ట్ ఫొటోస్
ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే స్పెషల్ సాంగ్స్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది తమన్నా. ఈమె చేసిన ఐటమ్ సాంగ్స్ రీసెంట్ టైమ్స్‌లో మరో స్టార్ హీరోయిన్ చేయలేదనే చెప్పొచ్చు. అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వర్, జై లవ కుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరు, ఘని, స్త్రీ2 చిత్రాల్లో ప్రత్యేకమైన పాటలకు చిందులేసింది మిల్కీ బ్యూటీ. ఇప్పుడు అజయ్ దేవగన్, రితేశ్ దేశ్ ముక్ స్టారర్లుగా వస్తోన్న రైట్ 2లో నషా అంటూ నిషా ఎక్కిస్తోంది మిల్కీ బ్యూటీ. ఇక ఎమ్మెల్యే మేడమ్ కేథరిన్ థెరిస్సా కూడా అప్పుడెప్పుడో జయ జానకి నాయకలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న గ్యాంగర్స్‌లో ప్రత్యేకమైన పాటకు ఊరమాస్ స్టెప్పులతో హీటెక్కిస్తోంది క్యాథరిన్. సి సుందర్ ఓన్ డైరెక్షన్‌లో అతడే హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రజెంట్ తమన్నా చేతిలో రేంజర్, ఓదెల 2 ఉన్నాయి. అలాగే క్యాథరిన్ గ్యాంగర్స్, ఫణి చేస్తుంది. మరీ ఈ స్పెషల్ సాంగ్స్ ఈ ముద్దుగుమ్మలకు ఏ మాత్రం ఆఫర్లను తెచ్చిపెడతాయో చూద్దాం.