ఏపీలో మరోసారి కలకలం రేగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇది గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పనా? లేదా ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: ఆకాశంలో ఎగిరే కార్లు వచ్చేశాయి… ధర ఎంతో తెలుసా?
ఇటీవల ఏపీలో దేవాలయాలపై దాడులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై మళ్లీ చర్చ మొదలైంది. గతంలో పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన సంచలనం సృష్టించగా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.