కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి విరిగిన పాలతో అభిషేకం చేశారు అనేది అవాస్తవం అని ఆలయ ఈవో పెంచుల కిషోర్ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని భక్తులు నమ్మొద్దన్నారు. టెండర్ దారుడు ఇద్దరు భక్తులకు విరిగిన పాలను అందించారని, ఆ ఇద్దరు భక్తులు అతనితో వాద్వాదించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఆ పాలను అభిషేకానికి వినియోగించలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో అర్చకులు పరిశీలించిన అనంతరమే స్వామివారికి అభిషేకం చేపట్టారన్నారు.…
తిరుపతి బాలాజీ ఆలయ దర్శనానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కొండల మధ్య ఉంది. కలియుగంలో వేంకటేశ్వరుడు తన భక్తులను సమస్యల నుండి రక్షించడానికి అవతరించినట్లు భక్తులు విశ్వసిస్తారు. మీరు కూడా తిరుపతి బాలాజీని సందర్శించాలనుకుంటే తిరుమల దర్శన్ ప్యాకేజీని బుక్ చేసుకోవడం ద్వారా మీరు ఒకేసారి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. కాబట్టి వివరాలు తెలుసుకుందాం.
Bakthi: ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకునికి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా మొదటి పూజ వినాయకుడికి చేసి పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. అయితే వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆకాణిపాక వినాయకుని చరిత్ర ఏమిటి? అలానే ఆ గుడిలోని వినాయకుని విశిష్టత ఏమిటి ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ…
Bakthi: కాలం మారిన ఎంతగా అభివృద్ధి చెందిన కొన్ని అలవాట్లు మాత్రం మారవు. అలా అప్పటికి ఇప్పటికి, ఎప్పటికి మనల్ని వీడని అలవాట్లలో ఒకటి ఎవరైనా అబద్దం చెప్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఏది ఒట్టేసి చెప్పు అని అడగడం. సరదాగా అలా ఒట్టేస్తే పర్లేదు కానీ.. ఈ గుడిలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రమాణం చేసి అబద్దం చెప్పకూడదు. అలా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు కొందరు అనుభవజ్ఞులు. ఇంతకీ ఆ ఆగుడి ఎక్కడ ఉంది.…
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఓ భక్తుడు కలకలం సృష్టించారు… తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య ఒత్తిడితో మొత్తానికి మందు మానేయలనే నిర్ణయానికి వచ్చాడు.. కాణిపాకంలో గణపతి సాక్షిగా మందు మానేయాలని భావించిన ఆయన.. ఇదే మందు తాగడం చివరి సారి అనుకున్నాడో ఏమో.. కానీ, ఫుల్ట్‌గా మందు కొట్టి వచ్చాడు.. దేవుడు దగ్గర మద్యం మానేయటం కోసం వచ్చిన ఆ భక్తుడు… భార్య కోరిక మేరకు మద్యం మానేస్తానంటూ ప్రమానం చేసేందుకు సిద్ధం అయ్యారు..…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాణిపాకం ఆలయంలో భక్తులకు షాక్ ఇచ్చింది.. ఒకటి. కోరికలు నెరవేర్చే మహిమగల పుణ్యక్షేత్రంగా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి పేరు ఉంది.. అయితే, కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ల ధర భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది పాలక మండలి… పంచామృతాభిషేకం టికెట్ ధర ప్రస్తుతం 700 రూపాయలుగా ఉంటే.. ఆ టికెట్ ధరను ఏకంగా 5000 రూపాయలకు పెంచుతూ నోటీస్ బోర్డ్ లో ప్రకటించింది ఆలయ కమిటీ.. ఇప్పటిదాకా రోజూ మూడుసార్లు నిర్వహిస్తున్న…
ఏపీలో మరోసారి కలకలం రేగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇది గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పనా? లేదా ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానాలు…
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ప్రమాణాల వివాదం కొనసాగుతుంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదంపై బీజేపీ వైసీపీ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తనపై రాచమల్లు చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవంటూ కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సత్య ప్రమాణానికి ఎమ్మెల్యే రాచమల్లు ముందుకురావాలని…