తిరుమల : టిటిడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుల నియామకంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజా గా సీఎం జగన్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తన సిఫార్సు తో రవిప్రసాద్ అనే వ్యక్తికి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుడిగా నియామకం జరిగినట్లు ప్రచారం జరుగుతుందని విస్మయం వ్యక్తం చేసిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను కాని…తన మంత్రిత్వ శాఖ ద్వారా కాని ఎవరికి సిఫార్సు చేయలేదని లేఖలో కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిశిలన జరపాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. తన పై దుష్ప్రచారం చేస్తూన్న వారి చర్యలు తీసుకోవాలని కోరారు కిషన్ రెడ్డి.