Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Union Minister Gajendra Singh Shekhawat About Pm Narendra Modi

Gajendra Singh Shekhawat: గతంలో ఇండియా అంటే గాంధీ.. ఇప్పుడు మోడీ..

Published Date :March 4, 2022 , 8:58 pm
By Sudhakar Ravula
Gajendra Singh Shekhawat: గతంలో ఇండియా అంటే గాంధీ.. ఇప్పుడు మోడీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తుకు వచ్చేవారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకు వస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ లాంటి నేత మరెవరూ లేరన్న ఆయన.. ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్ పార్టీ బీజేపీ అన్నారు. అతి చిన్న పార్టీగా ప్రస్ధానం మొదలు పెట్టి.. అతి పెద్ద పార్టీగా అవతరించిందని.. అతి పెద్ద పార్టీగా అవతరించినా సిద్ధాంతాలను ఏనాడూ వదల్లేదని.. చివరి వరుసలో కూర్చొన్న వాళ్లకూ సంక్షేమ ఫలాలు అందేలా చూడడం మోడీ లక్ష్యంగా తెలిపారు గజేంద్ర సింగ్‌ షెకావత్.

Read Also: Venkaiah Naidu: చట్టసభల గౌరవాన్ని కాపాడండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్నారు షెకావత్.. ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తొచ్చే వారని.. ఇప్పుడు మోడీ గుర్తొస్తున్నారని తెలిపారు. మోడీ ప్రధాని కాక ముందు ప్రతి రోజూ బాంబ్ బ్లాస్టులు జరిగేవి.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్న ఆయన.. గ్రామ, రైతులు, పీడిత ప్రజల అభివృద్ధే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని తెలిపారు.. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ పథకం అమలు ఏపీలో సరిగా జరగడం లేదని.. జల్ జీవన్ మిషన్ పథకం కింద ఏపీకి రూ. 7 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ. 3800 కోట్లు.. ఇప్పటి వరకూ జల్ జీవన్ మిషన్ కింద ఏపీ కేవలం రూ. 190 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని.. కేవలం 20 శాతం మాత్రమే జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏపీలో అమలు చేశారన్నారు.. జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. బెంగళూరులో జరిగే దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఈ అంశంపై ఏపీని ప్రశ్నిస్తాం అన్నారు. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఇలాంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. నరేగా కింద రూ. 70 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చారని.. రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 64 వేల కోట్లు ఏపీకి ఇచ్చామని.. పేదలు మోడీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతున్నారని.. అద్భుతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వమేనని.. దేశంలోని నూటికి నూరు శాతం గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • Gajendra Singh Shekhawat
  • india
  • PM Narendra Modi

తాజావార్తలు

  • Email Address: మీ పాత జీమెయిల్ ఐడీ నచ్చలేదా?.. కొత్త ఫీచర్‌తో ఈమెయిల్ అడ్రస్ సులభంగా మార్చుకోండి.. డేటా సేఫ్

  • UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..

  • Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..

  • S*exual Torture: భర్తపై భార్య లైంగిక వేధింపులు, స్నేహితురాలిని సుఖపెట్టాలని టార్చర్..

  • Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions