Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Undavalli Arun Kumar Sensatioal Comments On Central And Ap State Governments

Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది

Published Date :July 30, 2023 , 1:31 pm
By NTV WebDesk
Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Undavalli Arun Kumar Sensatioal Comments On Central And AP State Governments: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని.. ఇంకా పునాదుల్లోనే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తీర్మానం జరిగి ఇవాల్టికి పదేళ్లయిందని అన్నారు. ఉమ్మడి రాజధాని, పోలవరం నేషనల్ ప్రాజెక్టును తీర్మానంలో ప్రస్తావించి.. రాష్ట్ర విభజన చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు నుండి ఒక్క ఏడాదిలోనే బయటకు వచ్చామని చెప్పారు. దుగరాజపట్నం పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు కనీసం ప్రారంభించలేదని మండిపడ్డారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పి, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు మోడీకి అనుకూలంగా ఉన్నాయని ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్ర ఏం చేసినా.. గట్టిగా ఎదుర్కొనే పరిస్థితిలో అధికార, ప్రతిపక్షాలు లేవని తేల్చి చెప్పారు. ఒక్క శాతం ఓట్లు లేకపోయినా.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉందన్నారు. వైసీపీ, టీడీపీ బలం కూడా కేంద్రానికే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని.. అసలు అవిశ్వాస తీర్మానాన్ని గట్టిగా ఎక్స్‌పోజ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో మీ వాదనని గట్టిగా వినిపించాలని.. కేంద్రానికి ఇంత త్వరగా సరెండర్ అయిపోవల్సిన అవసరం లేదని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం మీకు తెలిసినా.. ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. రూ.4117 కోట్లు మాత్రమే రెవిన్యూ డెఫిషిట్‌గా కేంద్రం మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వచ్చిందని.. మొన్న మాత్రం పదివేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. కేంద్రం చెప్పిన మాట వింటే.. ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తారన్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి 35 వేల కోట్లు రెవిన్యూ డిఫిషిట్ రావాలని అడిగారని వెల్లడించారు.

Diabeties Control : వారంలో 3 సార్లు తాగితే చాలు .. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది..

సీఎం జగన్, చంద్రబాబు కూడా కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారనే భావన కనిపిస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బుందేల్ఖండ్‌కి ఏ ప్రాతిపతికన సహాయం చేశారో.. అదే ప్రాతిపదికన చేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.24,350 కోట్లు అని తెలిపారు. టాక్స్ బెనిఫిట్ పెద్దఎత్తున రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. వీటి గురించి గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని నిలదీశారు. రాష్ట్ర విభజన దారుణమైన స్థితిలో జరిగిందని.. షోరూం తెలంగాణకు వస్తే, గోడౌన్ మాత్రమే ఆంధ్రకు వచ్చిందని అభివర్ణించారు. ఆదాయం అంతా తెలంగాణకే లభిస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానంలో అన్ని విషయాలు మాట్లాడాలని, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు. 20-21లో నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుండి 6 ప్రాజెక్టులు వచ్చాయని, వాటిని ఆదానికి అప్పజెప్పారని అన్నారు. ఎన్‌హెచ్‌పీసీ లాంటి అగ్రిమెంట్లను ప్రైవేటుకు అప్పచెప్పటం సరికాదన్నారు. ఫైర్ సర్వీసెస్ సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన నిబంధన తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిసిందని.. అది ఏమాత్రం సరికాదని హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrababu Naidu
  • PM Narendra Modi
  • Polavaram project
  • Undavalli Arun Kumar
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

  • Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

  • Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

  • PSL 2026 Controversy: “ఆ బోలింగ్ బాలేదు.. నేను ఆడను పో”.. పాకిస్థాన్ సుపర్‌ లీగ్‌లో గమ్మత్తు ఉదంతం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions