Site icon NTV Telugu

Undavalli: పొత్తులపై ఉండవల్లి సంచలనం.. వారు విడిపోయినా ఆశ్చర్యంలేదు..!

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్‌ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.

Read Also: Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ చీఫ్‌ చంద్రబాబు మాటలు బట్టి టీడీపీ-జనసేన మధ్య పొత్తులు ఉంటాయని భావిస్తున్నానని తెలిపారు ఉండవల్లి.. అయితే, ఏపీలో సీఎం జగన్ కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులుండవని జోస్యం చెప్పారు.. ఏపీలో రాజకీయం ఎలా ఉన్నా మనకేంటనే భావనలో బీజేపీ ఉంటే పొత్తులుంటాయన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండదనే భావిస్తున్నానని వెల్లడించారు. ఇక, జనసేన-బీజేపీలు విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని బాంబ్‌ పేల్చారు ఉండవల్లి.. మరి ఏపీలో ఎన్నికల వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..? ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు..? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరింత కాలం వేచిచూడాల్సిందేనేమో.

Exit mobile version