ఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, మచిలీపట్నం-తిరుపతి, కాకినాడ-తిరుపతి, కాకినాడ-వికారాబాద్, తిరుపతి-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
★ సికింద్రాబాద్-తిరుపతి (రైలు నం: 07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది
★ మచిలీపట్నం-తిరుపతి (రైలు నం: 07095) ఏప్రిల్ 1న సా.6:25 గంటలకు బయలుదేరుతుంది
★ తిరుపతి-కాకినాడ (రైలు నం:07598) ఏప్రిల్ 2న రాత్రి 9:55 గంటలకు బయలుదేరుతుంది
★ కాకినాడ-వికారాబాద్ (నం:07599) 3న రాత్రి 8:45 గంటలకు బయలుదేరుతుంది
★ తిరుపతి-మచిలీపట్నం (నం:07096) 2న రాత్రి 10:15 గంటలకు బయలుదేరుతుంది