తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. వర్సిటీలోని వీసీ బంగ్లాలోకి వచ్చి పెంపుడు కుక్కను చంపి ఎళ్తుకెళ్లింది చిరుత.. వీసీ బంగ్లా సమీపంలో రెండు చిరుతలు సంచరించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.. దీంతో, అధికారులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఒంటరిగా బయటకు రావద్దని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు.. వర్సిటీలో త్వరలో బోన్లు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు..
మరోవైపు, కర్నూలు జిల్లాలోనూ చిరుత సంచారం ఆందోళనకు గురిచేస్తోంది.. దేవనకొండ మండలంలో చిరుతను చూసి వణికిపోతున్నారు స్థానికులు.. కరిడికొండ కొండలలో చిరుతను చూశారు రైతులు, గొర్రెల కాపరులు.. ఈ విషయం తెలిసి.. స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు భయపడిపోతున్నారు.. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు.. కరిడికొండ, కరివేముల, కొత్తపేట, గద్దెరాళ్ల ,పల్లె దొడ్డి, ఓబులాపురం, జిల్లేడుబుడకల గ్రామాల ప్రజలు రాత్రి సమయంలో పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. అయితే, నీటి కోసం ఫారెస్ట్ నుంచి జంతువులు బయటకు వస్తున్నాయని.. ఫారెస్ట్‌లకు సమీపంగా ఉండే గ్రామస్తులు, పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.