YCP MP: పోలీస్ స్టేషన్లో ఎంపీ నందిగం సురేష్ ఎపిసోడ్లో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్చల్ ఎపిసోడ్లో ట్విస్ట్ నెలకొంది. నందిగం సురేష్ అనుచరుల పై ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ బయట, లోపల ఎంపీ అనుచరులపై దుర్భాషలాడుతూ ఇన్స్పెక్టర్ చేయి చేసుకున్నట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎంపీ సురేష్ అనుచరులపై ఇన్స్పెక్టరే చేయి చేసుకున్నట్లు వీడియోల్లో వెల్లడైంది. తమపై చేయి చేసుకోవటం వల్లే అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చామని బాధితులు వాపోతున్నారు.
ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కారణం లేకుండా కొట్టారని.. టిఫిన్ చేయటానికి వచ్చామని చెప్పినా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని బాధితుడు మహేష్ తెలిపాడు. స్టేషన్లో బూటు కాళ్ళతో తన్నారని ఆరోపించాడు. పోలీసులు తమ ఫోన్లు లాక్కుని వీడియోలు డిలీట్ చేశారన్నాడు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు తమపై దాడి చేసి బండి తాళాలు ఇన్స్పెక్టర్కు ఇచ్చారన్నారు. ఫోన్లో తాము దెబ్బలు తింటున్న సౌండ్ విని ఎంపీ సురేష్ వచ్చారని.. ఆయన వచ్చినా ఇన్స్పెక్టర్ ఖాతరు చేయకుండా ఎంపీ అయితే ఏంటి అని అమర్యాదగా మాట్లాడారని బాధితుడు మహేష్ పేర్కొన్నాడు. కొంత మంది ఎంపీ అనుచరులు పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు తమను గంట, గంటన్నర పాటు కొట్టారని.. దీంతో రాత్రంతా స్టేషన్లోనే ఉంచారని వివరణ ఇచ్చాడు.
Also Read
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..