TTD: తిరుమలలో డ్రోన్ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది.. శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు విమానాలకు కూడా అనుమతి లేదు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగించే విషయం.. ఈ వ్యవహారం ఒక్కసారిగా టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాలను చిత్రీకరించిన సదరు వ్యక్తిపై ఫోకస్ పెట్టింది.. ఇన్ స్టాలో విజువల్స్ పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం.. అయితే, హైదరాబాద్ కి చెందిన వ్యక్తి తిరుమల డ్రోన్ విజువల్స్.. తన ఇన్‌స్టాలో పోస్టు చేసినట్టు గుర్తించారు పోలీసులు.. మరో వైపు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని విజువల్స్ ని సదరు వ్యక్తి తొలగించారు..
Read Also: Human Heart: ఆమె కన్నుమూసింది.. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ముగ్గురికి పునర్జన్మనిచ్చింది..
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
అయితే, సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఆ విజువల్స్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపేందుకు టీటీడీ అధికారులు సిద్ధం అవుతున్నారు.. ఇక, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఇది ఇటీవల తీసిన వీడియో కాదని కొట్టపారేస్తున్నారు.. పాత వీడియో కావొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. వీడియో కొత్తదా పాతదా అనే విషయం అటుంచితే.. అసలు శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో ఏరియల్ వ్యూలో చిత్రీకరించడం నిషేధం.. వీడియో పాతదైనా, కొత్తదైనా నేరమే.. దీంతో, సోషల్ మీడియాలో పోస్టుచేసినవారిపై.. యూట్యూబ్ చానెళ్లలో పెట్టినవారిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. శుక్రవారం నాడు డ్రోన్‌తో వేంకటేశ్వరుని ఆలయాన్ని వీడియోగ్రాఫింగ్ చేసే అవకాశాలను ఖండించారు మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్వో నరసింహ కిషోర్.. ప్రధాన ఆలయం మరియు చుట్టుపక్కల భద్రతను పెంచారు మరియు దానిని డ్రోన్ కెమెరాతో బంధించడం అత్యంత అసాధ్యం అని తెలిపారు.. వైరల్ వీడియోను తదుపరి ధృవీకరణ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపుతామని, తప్పు చేసిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!