ఆనందయ్య మందు తయ్యారి నుంచి వెనక్కి తగ్గింది టీటీడీ. ఆనందయ్య మందుకి ప్రభుత్వ అనుమతులు వస్తే… తమ ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో మందు తయ్యారికి ఏర్పాట్లు చేసిన టీటీడీ… ఆనందయ్య మందు తయ్యారిలో వినియోగించే పదార్దాల సేకరణ భాధ్యతను అటవి శాఖకు అప్పగించింది. ఆ పదార్దాల లభ్యత శేషాచల కోండలలో భారిగా వుందని అటవీశాఖ గుర్తించింది. కానీ ఆనందయ్య మందుకు గుర్తింపు ఇవ్వని కేంద్రం… చేప మందు తరహాలోనే పంపిణికి అనుమతించింది. అనుమతులు రాక పోవడంతో మందు తయ్యారి నుండి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించింది టీటీడీ.